వడియరాజుల చరిత్ర

వడియరాజులు వోధ్ర దేశం (ప్రస్తుత వడిసా) నుండి వలస వచ్చి కాలక్రమేణా వడ్డెరలుగా రూపాంతం చెందారు.

నెల్లూరు వడియ (చోళ) రాజులు

మన అందరికి తెలుసు 11వ శతాబ్దం లో జరిగిన కాటమరాజు కథ చూసిన యెడల ఆ యుద్ధము వడియ రాజు అయిన నల్లసిద్ది చోళ మరియు యాదవ రాజు అయిన కాటమరాజు మధ్య జరిగింది. దీనిని ఆధారముగ చేసుకొని పరిశిలించి చూడగా మన వడియరాజుల పాలనా వివరాలు తెలుసుకున్నాము. వాల్కేతవ మహారాజుగారు చోళ రాజు. మనం గనుక నెల్లూరు చోళరాజుల చరిత్ర చూసినట్లు అయితే రెండవ కరికాళ చోళుడు మొదటి వాడు. అతని తరువాత వంశ వృక్షము ను మనము గమనించినట్లయితే ఈయన కుమారుడు మధురాంతక పొత్తపి చోళుడు. ఈయన కుమారుడు తెలుంగువ విద్యన ఈయన కుమారుడు దాయ భీమ. దాయ భీమాకు ఇద్దరు కుమారులు మొదటివాడు బేత భూప రెండవవాడు సిద్ధ చోళ. బెతభూప అనంతరము ఈయన కుమారులలో ఒకడైన ఎర్రసిద్ద సింహాసనము అధిష్టించాడు. యెర్ర సిద్ధ కు నలుగురు కుమారులు. ఎర్రసిద్ధ అనంతరము మన్మ సిద్ధ రాజ్యాధికారము వహించాడు. మన్మసిద్ద తరువాత చోదతిక్క తరువాత ఆయన కుమారుడు మనుమసిద్ధ పరిపాలించారు. రెండవ మనుమసిద్ధ 1249 నుండి 1270 వరకూ రాజ్యపాలన చేసినట్లు శాశానాలు లభించాయి. మనుమసిద్ధి ముగ్గురు కుమారులలో ఒకడైన నల్లసిద్ద 1270 నుండి 1275 వరకూ రాజ్యపాలన చేసారు. యాదవ రాజు అయిన కటమరాజుకు ఈయనకూ మధ్య ఘోరయుద్ధము జరిగినది. ఈ యుద్ధములో విజయము సాధించినప్పటికీ రాజ్యము చాలా దీనావస్తలో పడినది. రాజకియముగా అనేక మార్పులు సంభవించాయి. నల్ల సిద్ధికి 5గురు కుమారులు. వీరిలో ఒకడైన మనుమగండ గోపాల 1297 వరకూ ఈయన పరిపాలన కొనసాగింది. తరువాత నేల్లూరు చోళ రాజుల వంశము గాని మిగిలిన నలుగురు కొడుకుల వివరాలు గానీ పూర్తిగా లేవు. మా తాత గారు చెప్పిన విషయాలను బట్టి ఆ నాలుగు రాజ కుటుంబాలు అంకమ్మతల్లిని ఆశ్రయించిన వారూ ఒకటే అని నిర్ధారణకు రావడం జరిగింది.

చోళ సామ్రాజ్యం

చోళ సామ్రాజ్యం 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాల చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుళోత్తుంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10, 11, 12 శతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. మొదటి రాజరాజ చోళుడు, అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవులు నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్|లోని గోదావరి పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళ భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులుకి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజేంద్ర చోళ ఉత్తర భారతదేశం మీద విజయ యాత్ర చేసి పాటలీపుత్రంని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (మలయ్ ఆర్కిపెలగో) వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్దంకి పాండ్య రాజులు, 13వ శతాబ్ధానికి హోయసల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.

రాజరాజ నరేంద్రుడు

రాజేంద్ర చోళుడు లేదా మొదటి రాజేంద్ర చోళుడు (1014−1044) ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన 11వ శతాబ్దానికి చెందిన చోళ చక్రవర్తి (ప్రస్తుత తమిళనాడు, ఆంధ్రప్రదేశు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు) . ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గంగానది తీరం వరకు, హిందూ మహాసముద్రం దాటి పశ్చిమానికి, ఆగ్నేయ ఆసియా వైపుకి విస్తరించింది. అందుకనే ఇది ప్రాచీన భారతీయ రాజ్యాలలో బలమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతోంది తన విజయాలకు గుర్తుగా గంగైకొండ చోళుడు (గంగానది ప్రాంతాన్ని జయించిన వాడు) అనే బిరుదు పొందాడు.రాజేంద్ర చోళుడు చోళపురం అనే కొత్త రాజధాని కూడా నిర్మించాడు. ఈయన తన కుమార్తె అమ్మాంగ దేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు.

రాజరాజ నరేంద్రుడు మరియు అమ్మాంగ దేవి కుమారుడే కులుత్తోంగ చోళుడు(చాలుక్యుడు). తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు ఇతని విజయాలను గూర్చి వర్ణిస్తాయి. ఈయన తర్వాత ఇతని కుమారుడు రాజాధిరాజు విజయ రాజేంద్ర అనే పేరుతో రాజ్యాన్ని పరిపాలించాడు.

రాజరాజ నరేంద్రుడు (సా.శ. 1019–1061) దక్షిణ భారతదేశంలో వేంగి రాజ్యం యొక్క తూర్పు చాళుక్య రాజు. వివాహ, రాజకీయ లింకుల ద్వారా తంజావూరు యొక్క చోళులతో రాజరాజకు సంబంధముంది. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం (రాజమండ్రి) స్థాపించాడు. అతని కాలం సామాజిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.

తన కాలంలో సాహిత్య రచనలు : రాజరాజ నరేంద్రుడి కాలంలో రెండు సాహిత్య రచనలు ఉదాహరణకు విక్రమార్జున విజయం, గదాయుద్ధం కన్నడ భాషలో రచించబడ్డాయి, అవి అప్పటికే కర్నాటకలో సంస్కృత మహాభారతం యొక్క కథలుగా ప్రాచుర్యం పొందాయి. ఏడవ, ఎనిమిదవ శతాబ్దాలలోనే మహాభారతం యొక్క తమిళ అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, పురాణాలు తెలుగులో అందుబాటులో లేవు. తూర్పు చాళుక్య రాజవంశస్తులు జైనమతం, శైవ మతానికి మద్దతు నిచ్చారు. రాజరాజ నరేంద్రుడు శైవమతస్తుడు (Shaivite). అతను జైనులు, బౌద్ధుల యొక్క విజయం నుంచి అన్ని మతాలను ఆదరించడం, పురాణాలను తెలుగులోకి అనువదించడం వంటివి విజయానికి ఏకైక మార్గమని నేర్చుకున్నాడు. ఒక వెయ్యి సంవత్సరాల ముందే, బౌద్ధమతం, జైనమతం వారి ప్రబోధాల, శిక్షణల కొరకు స్థానిక భాషలను ఉపయోగించి బాగా ప్రాచుర్యం పొందారు. కనుక, రాజరాజ నరేంద్రుడు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని తన గురువు, సలహాదారు, ఆస్థాన కవి అయిన నన్నయ భట్టారకుని అభ్యర్థించాడు. నన్నయ భట్టారకుడు ఈ కార్యక్రమాన్ని చాలా తీవ్రమైన సవాలుగా తీసుకున్నాడు. అతను, ఆ సమయంలో వాడుకలో ఉన్న అన్ని తెలుగు పదజాలాలను పరిశీలిస్తూ, సంస్కృత పదజాలం పరిచయం చేసుకొని, ఆ విధంగా అతను ఒక ప్రత్యేకమైన సాహిత్య శైలి, ఛందస్సు,, వ్యాకరణం అభివృద్ధి చేశారు. నన్నయ సంస్కృత మహాభారతంలోని ఆది, సభ, అరణ్య పర్వాల యొక్క 142 పద్యాలను అనువదించాడు. అయితే, అతను అసలైన దానికి కట్టుబడి వ్రాయలేదు. కథాంశం కొనసాగిస్తూ సవరణలు, తొలగింపులు చేస్తూ, అందనంగా మరికొంత చేర్చుతూ అతను దాదాపు ఆంధ్రమహాభారతం యొక్క సొంత కథనం రూపొందించారు. తన భాష చాలా సంస్కృతీకరించబడినది, పాఠకులకు ఆనందానిచ్చింది.